మొక్కలు ప్రాధాన్యత గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక ప్రత్యేకమైన మొక్క గురించి తెలుసుకుందాం. సైథియా రోజాసియానా అనే మొక్క ఆకులు చనిపోయిన తర్వాత వేర్లుగా మారుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు.
పనామాలోని క్యూబ్రాడా చోరో అనే అడవిలో ఈ మొక్క రాలిన ఆకుల నుంచి భూమిలోకి వేర్లు పాకినట్లు గుర్తించామని పరిశోధకులు పేర్కొన్నారు. ఈ వేర్లు మొక్కకి పోషకాలు అందిస్తాయి. చనిపోయిన ఆకులకు వేర్లుగా తిరిగి జీవం పోసే ఏకైక మొక్క ఇదేనని వారు పేర్కొన్నారు.