భరూచ్‌లోని కవి కాంబోయి సమీపాన సముద్రతీరంలో మత్స్యకారులు వేటకు వెళ్లారు. చేపల కోసం వారు వల వేశారు. ఈ క్రమంలో వలలో చేపలకు బదులుగా ఓ భారీ అరుదైన శివ లింగం చిక్కింది.
అనంతరం ఈ భారీ శివలింగాన్ని అతి కష్టం మీదకు ఒడ్డుకు చేర్చారు. ఈ శివలింగం చూడటానికి స్తంభేశ్వర్ మహాదేవ్ శివలింగం మాదిరిగా పొడవుగా, అత్యంత బరువుగా ఉన్నట్టు మత్స్యకారులు చెబుతున్నారు. ఈ వార్త చుట్టు పక్కల గ్రామాలకు వైరల్ కావడంతో శివలింగాన్ని చూసేందుకు జనాలు భారీగా తరలివచ్చారు.