పాకిస్థాన్‌లో నిన్న సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. అయితే ఎన్నికల సమయంలో పాక్ అంతటా సెల్యులర్ సేవలు, ఇంటర్నెట్ సేవలు నిలిపివేయబడ్డాయి. దీంతో సార్వత్రిక ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ వెల్లడించలేకపోయామని అక్కడి మీడియా వెల్లడించింది.
ఎన్నికల రోజున నెట్‌వర్క్ కనెక్టివిటీని ప్రభావితం చేయమని పాక్ ఆపద్ధర్మ ప్రభుత్వం హామీ ఇచ్చినా..ఓటింగ్ ప్రక్రియ ప్రారంభానికి ఎనిమిది నిమిషాల ముందు సెల్యులార్ సేవలను నిలిపివేసిందని పేర్కొంది.