ఆలయాలలో దైవ దర్శనం తర్వాత పవిత్రమైన తీర్థ ప్రసాదాలు అందిస్తారు. తీర్థంలో పంచామృతాలు, తులసీదళాలు, సుగంధ ద్రవ్యాలు, మంత్ర శక్తి ఉంటాయి. అయితే ఈ పవిత్రమైన తీర్థాన్ని మూడుసార్లు తీసుకోవాలట.
అలాగే కుడిచేయి కింద ఎడమచేతిని ఉంచి తీర్థం తీసుకోవాలి. ఆ సమయంలో తీర్థాన్ని తీసుకున్నాక చేతిని తలకు తుడుచుకోకూడదు. ఎందుకంటే తలపై బ్రహ్మదేవుడు ఉంటాడు. కావున అలా తుడిస్తే బ్రహ్మదేవుడికి ఎంగిలిని అర్పించినట్లు అవుతుంది. అది మహా పాపం.