జనసేన పార్టీ నేత నాగబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ విడుదల చేస్తున్న జాబితాపై స్పందించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ ఏడో జాబితా కాదు... లక్ష జాబితాలు విడుదల చేసినా తమకు నష్టం లేదని, జనసేన ఎన్ని అసెంబ్లీ , పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయాలో తమ అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయిస్తారని అన్నారు. పార్టీలో ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే...పరిష్కరించుకొని ముందుకు వెళ్తామన్నారు. టీడీపీ, జనసేన కూటమితో బీజేపీ కలిసి వస్తుందని భావిస్తున్నామన్నారు. మరో పది రోజుల్లో జనసేన పోటీ చేసే అభ్యర్థులను తమ అధినేత పవన్ ప్రకటిస్తారని స్పష్టం చేశారు. టీడీపీ, జనసేన మధ్య పొత్తు ఉంది కాబట్టి..టీడీపీ నేత చింతకాయల విజయ్‌తో మర్యాద పూర్వకంగానే కలిశామని చెప్పారు. అనకాపల్లి ఎంపీ పోటీ అంశం చర్చకు రాలేదని, తాను ఎక్కడ నుంచి పోటీ చేయాలో మా పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని నాగబాబు స్పష్టం చేశారు.