హంగేరి అధ్యక్షురాలు కేటిలిన్ నోవక్ తన అధ్యక్షురాలి పదవికి రాజీనామా చేశారు. ఓ చిల్డ్రన్స్ హోమ్‌లోని చిన్న పిల్లలపై లైంగిక ఆరోపణల కేసులో దోషిగా తేలిన వ్యక్తికి ఆమె క్షమాభిక్ష ప్రసాదించడంపై ఆ దేశంలో నిరసనలు వెల్లువెత్తాయి.
ఈ విషయంలో తాను తప్పు చేశానని అంగీకరిస్తూ.. ఆమె పదవి నుంచి తప్పుకున్నారు. ఈ కేసులో ఆవేదనకు గురైన బాధితులకు నోవక్ క్షమాపణలు చెప్పారు.