వైసీపీ నేతల వేధింపుల వల్లే అధికారులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ ఆరోపించారు. పలాస నియోజకవర్గ శంఖారావం సభలో ఆయన మాట్లాడుతూ.. 'మా హయాంలో ఉత్తరాంధ్రను జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మార్చాం.
వైసీపీ వచ్చాక ఉత్తరాంధ్రను గంజాయి క్యాపిటల్‌గా మార్చింది. శ్రీకాకుళం అంటేనే పోరాటాల గడ్డ. విశాఖ జిల్లాలో వైసీపీ నేతల భూ కబ్జాలు పెరిగాయి.' అని విమర్శించారు.