భారత్‌లో పునరుత్పాదక విద్యుత్ కొనుగోలు లక్ష్యం(రెన్యువబుల్ పవర్ ఆబ్లిగేషన్-RPO)లో 2021–22 నాటికి దేశంలో ఏపీ రెండో స్థానంలో ఉంది. ఈ విషయాన్ని నెడ్‌క్యాప్ వైస్ చైర్మన్, ఎండీ రమణా రెడ్డి వెల్లడించారు.
కర్ణాటక 41.3 శాతంతో మొదటి స్థానంలో ఉండగా.. 28.5 శాతంతో ఏపీ రెండో స్థానంలో ఉందని తెలిపారు. 2021–22 నాటికి ఆర్‌పీవో లక్ష్యాన్ని కేంద్రం 21.18 శాతంగా నిర్దేశించిందని పేర్కొన్నారు.