ఏపీలో రెబల్ ఎమ్మెల్యేల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇవాళ విచారణకు హాజరుకావాలని వైఎస్సార్‌సీపీ, టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలకు లేఖలు పంపారు. వైఎస్సార్ సీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఉదయం పూట విచారణకు హాజరుకావాలని.. టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు మధ్యాహ్నం విచారణకు రావాలని స్పీకర్ సూచించారు. అయితే ఈ రోజు విచారణకు రావడం లేదని స్పీకర్ తమ్మినేని సీతారాంకు వైఎస్సార్‌సీపీ రెబల్ ఎమ్మెల్యేలు లేఖ రాశారు. తమకు మరో రెండు వారాల సమయం ఇవ్వాలని స్పీకర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. అయితే టీడీపీ రెబల్ ఎమ్మెల్యేల హాజరవుతారా లేదా అన్నది కూడా మిస్టరీగా మారింది.
రాజ్యసభ ఎన్నికల సమయంలో రెబల్ ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారం తెరపైకి వచ్చింది. వైఎస్సార్‌సీపీ, టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని ఆ పార్టీల విప్‌లు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు.. వారిపై అనర్హత వేటు వేయాలని కోరారు. దీంతో స్పీకర్ ఎమ్మెల్యేలను విచారణకు పిలుస్తున్నారు. అయితే వారు మాత్రం తమకు కొంత సమయం కావాలని కోరుతున్నారు. అయితే టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు మాత్రం విచారణకు హాజరుకావడం లేదని చెబుతున్నారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు మాత్రం రెండుసార్లు హాజరయ్యారు. వైఎస్సార్‌సీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఇవాళ విచారణకు వైఎస్సార్‌సీపీ రెబల్ హాజరుకోబోమని తమ లేఖలో పేర్కొన్నారు. దీంతో స్పీకర్ తమ్మినేని సీతారాం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. అలాగే టీడీపీ రెబల్ ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ నిర్ణయం ఎలా ఉండబోతుంది అనేది ఉత్కంఠరేపుతోంది. రాజ్యసభ ఎన్నికల మసయంలో ఈ వ్యవహారం హీట్ పెంచింది.