మణిపూర్‌లోని ఇంఫాల్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు 1.99 కోట్ల రూపాయల విలువైన విదేశీ మూలానికి చెందిన 19 బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు సోమవారం తెలిపారు.అక్రమంగా తరలిస్తున్న బిస్కెట్లతో ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన కోచ్ డ్రైవర్, ప్రయాణికుడితో సహా ఇద్దరిని అరెస్టు చేశారు.అరెస్టయిన వారిని మైబం ప్రియోబ్రత సింగ్ (32), ఎ మినకేతన్ శర్మ (28)గా గుర్తించారు. అధికారిక ప్రకటన ప్రకారం, కస్టమ్స్ విభాగానికి చెందిన యాంటీ స్మగ్లింగ్ యూనిట్, విశ్వసనీయ సమాచారం మేరకు, ఇంఫాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని డిపార్చర్ టెర్మినల్ వద్ద అనుమానితులను పట్టుకున్నారు.స్వాధీనం చేసుకున్న 3.155 కిలోల బంగారు బిస్కెట్లను ఇంఫాల్‌లోని కస్టమ్స్ డివిజనల్ కార్యాలయంలో జప్తు చేశారు. ఆదివారం నాటి మార్కెట్ ధర ఆధారంగా నిషిద్ధ బంగారం బిస్కెట్ల మొత్తం విలువ రూ.1,99,20,644 ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు. నిందితులను కస్టమ్స్ చట్టం, 1962లోని సంబంధిత సెక్షన్ల కింద అరెస్టు చేశారు.