వృద్ధాప్యంలోని రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం 'కిసాన్ మాన్‌ధన్ యోజన' పథకం అమలు చేస్తోంది. 18-40 ఏళ్లలోను ఉన్న రైతులు ప్రతి నెలా రూ.55 నుంచి రూ.220 చెల్లించాలి.
60 ఏళ్లు నిండగానే రైతుల బ్యాంకు ఖాతాలో నెలకు రూ.3 వేల చొప్పున కేంద్రం జమ చేస్తుంది. రైతు చనిపోతే ఆయన భార్యకు పెన్షన్ మొత్తంలో సగం అందుతుంది. ఆధార్, బ్యాంకు ఖాతా, ఫోన్ నంబర్ వంటి వివరాలతో మీ సేవా కేంద్రాల ద్వారా రైతులు దీనికి అప్లై చేసుకోవచ్చు.