నేడు భారత స్వాతంత్ర్య ఉద్యమకారిణి, కవయిత్రి, రాజకీయవేత్త, ప్రఖ్యాత వక్త సరోజినీ నాయుడు జయంతి. ఆమెను ‘ది నైటింగేల్ ఆఫ్ ఇండియా‘ అని పిలుస్తారు. స్వాతంత్ర్య ఉద్యమంలో ఆమె ఏంతో చురుకుగా పని చేశారు. భారత జాతీయ కాంగ్రెస్‌కు మొదటి మహిళా అధ్యక్షురాలుగా పని చేశారు.
స్వాతంత్య్రానంతరం ఆమె భారత రాష్ట్రానికి మొదటి మహిళా గవర్నర్ గా సేవలు అందించారు. సరోజినీ నాయుడు 1898 ఏడాదిలో డాక్టర్ గోవిందరాజులు నాయుడు అనే వైద్యునితో కులాంతర వివాహం చేసుకోవడం ఓ పెద్ద సంచలనం అని చెబుతుంటారు.