యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ మంగళవారం రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ)కి శుభవార్త అందించింది. డబ్ల్యూఎఫ్ఐపై సస్పెన్షన్ను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి రానుంది. డబ్ల్యూఎఫ్ఐ సకాలంలో ఎన్నికలు నిర్వహించకపోవడంపై యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. గతేడాది డబ్ల్యూఎఫ్ఐని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. తాజాగా ఆ సస్పెన్షన్ను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.