దేశవాళీ క్రికెట్‌లో దుమ్ము రేపుతున్న ఛెతేశ్వర్ పుజారా జాతీయ జట్టులోకి వచ్చేందుకు ఎదురు చూస్తున్నాడు. కానీ, బీసీసీఐ సెలక్టర్లు మాత్రం అతడివైపు చూడటం లేదు. యువకులకే అవకాశాలు ఇస్తూ వారికి పరీక్ష పెడుతున్నారు. తాజాగా పుజారా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'తప్పకుండా జాతీయ జట్టులోకి వస్తాననే నమ్మకం ఉంది. నా బ్యాటింగ్ నైపుణ్యం మెరుగుపర్చుకుంటున్నా. ఫిట్‌నెస్‌పైనా దృష్టిపెట్టా.' అని పుజారా వ్యాఖ్యానించాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa