స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల్లో (ఎఫ్‌టీఏ) ‘డేటా ఎక్స్‌క్లూజివిటీ’ నిబంధన పొందుపరచాలని 4 ఐరోపా దేశాలతో కూడిన ఐరోపా ఎఫ్‌టీఏ (యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్) బ్లాక్ చేసిన డిమాండ్‌ను భారత ప్రభుత్వం తిరస్కరించింది.
తద్వారా దేశీయ జనరిక్ ఔషధ పరిశ్రమకు మేలు చేసినట్లు అవుతోంది. ఈ నిబంధనను ఆమోదిస్తే మనదేశానికి చెందిన ఫార్మా కంపెనీలకు, తద్వారా ఔషధ రంగానికి నష్టం వాటిల్లుతుందని ప్రభుత్వం అభిప్రాయపడింది.