మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్‌నాథ్ పార్టీ మారనున్నట్లు వార్తలొస్తున్న విషయం తెలిసిందే. తాజాగా దీనిపై క్లారిటీ వచ్చింది. కమల్‌నాథ్ పార్టీ మారడంలేదని, కాంగ్రెస్‌లోనే కొనసాగనున్నారని తెలుస్తోంది.
రేపు మధ్యప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు ఏర్పాటు చేసిన సమావేశానికి కమల్‌నాథ్ కూడా హాజరుకానున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఆయన పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలన్నీ అవాస్తమని తెలుస్తోంది.