మనం ఆలయానికి వెళ్తే ముందుగా ప్రదక్షణలు చేసి దేవుడిని మొక్కుతారు. ముఖ్యంగా శివాలయంలో ప్రదక్షిణ ఎలా చేయాలో చాలా మందికి తెలీదు. ఇతర ఆలయాల్లో చేసినట్లుగా శివాలయంలో కూడా గుడి చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణలు చేస్తుంటారు.
కానీ, అలా చేయకూడదని పండితులు చెబుతున్నారు. ధ్వజస్తంభం దగ్గర ప్రదక్షిణ మొదలుపెట్టి సోమసూత్రం వరకు వెళ్లి, మళ్లీ తిరిగి వెనక్కి ధ్వజస్తంభం వరకు వెళ్లాలి. ఇలా చేస్తే శివాలయంలో ఒక ప్రదక్షిణ చేస్తే మంచిదని సూచిస్తున్నారు.