ఆర్మీ కొత్త వైస్ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. నార్తర్న్ ఆర్మీ కమాండర్‌గా పనిచేసిన ఆయన లెఫ్టినెంట్ జనరల్ ఎంవీ సుచీంద్ర కుమార్ స్థానాన్ని భర్తీ చేశారు.
ఉపేంద్ర ద్వివేది, దీనికి ముందు నేషనల్ వార్ మెమోరియల్ వద్ద అమరవీరులకు నివాళులు అర్పించారు. అలాగే కొత్త బాధ్యతలు స్వీకరించే ముందు గార్డ్ ఆఫ్ హానర్ అందుకున్నారు.