పాలస్తీనా భూభాగాలపై ఇజ్రాయెల్ 57ఏళ్ల ఆక్రమణ చట్టబద్దతపై చారిత్రక విచారణను ప్రారంభించేందుకు అంతర్జాతీయ న్యాయస్థానం(ICJ) సిద్దమవుతోంది. ఇందుకోసం ఒక వారం పాటు షెడ్యూల్ ఖరారైంది.
ప్రస్తుతం గాజాలో ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న సైనిక దాడితో ఇజ్రాయెల్‌పై దక్షిణాఫ్రికా మారణహోమం ఫిర్యాదు దాఖలు చేసింది. ఇందులో భాగంగా 1967నుంచి ఇజ్రాయెల్ వెస్ట్ బ్యాంక్, గాజా, తూర్పు జెరూసలేంలను ఆక్రమించడంపై ICJ విచారణకు దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది.