సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీ సీఎం జగన్ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పార్టీ ముఖ్యనేతలు, ఐ ప్యాక్ టీమ్‌తో సోమవారం సమావేశమయ్యారు. ఎన్నికలకు సంబంధించి వ్యూహాలు,
అభ్యర్థుల మార్పులకు సంబంధించిన పార్టీ ముఖ్యనేతలతో ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. అలాగే ఎన్నికలపై పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు ఫోకస్ పెట్టాలని సీఎం జగన్ సూచించారు. ఈ సారి 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంట్ స్థానాలు గెలవాలన్నారు.