ఏఐఎంఐఎం నేత వారిస్ పఠాన్ ముంబై సమీపంలోని మీరారోడ్‌కు వెళ్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.మీరా రాడ్‌లోని నయా నగర్ ప్రాంతంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉన్నందున అక్కడికి వెళ్లవద్దని ఎఐఎంఐఎం నేతకు నోటీసులు అందజేసినట్లు పోలీసులు తెలిపారు. మీరా రోడ్డు ప్రాంతంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. జనవరి 22న అయోధ్యలో రామమందిరం ప్రాణ్ ప్రతిష్ఠా వేడుకకు ముందు వాహనాల ర్యాలీని చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం ప్రజలను కలిసేందుకు పఠాన్ మీరా రోడ్డుకు వెళ్తున్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి అదే రోజు కావడంతో, పోలీసులు ఫిబ్రవరి 18, ఆదివారం పఠాన్ ఇంటికి వెళ్లి, CRPC సెక్షన్ 149 కింద నోటీసు అందజేశారు.పోలీసులు నోటీసు ఇచ్చినప్పటికీ, పఠాన్ మీరా రోడ్డుకు వెళుతుండగా, దహిసర్ పోలీసులు అతన్ని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.