రణస్థలం మండలం మెంటాడ పంచాయితీ సర్పంచ్ ప్రతినిధి ఆర్ఎస్ రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 60 కుటుంబాలు టీడీపీ నుంచి వైసీపీలో చేరారు. వీరికి ఎచ్చెర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ మంగళవారం ఆయన క్యాంపు కార్యాలయంలో పార్టీ కండువాలు కప్పి, పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఖాయమని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల వైసీపీ నాయకులు పాల్గొన్నారు.