రాయదుర్గం పట్టణంలోని రెండు సచివాలయాల్లో మంగళవారం నుండి 23వ తేదీ వరకు ప్రత్యేక ఆధార్ నమోదు కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ షేక్ మాలిక్ ఒక ప్రకటనలో తెలిపారు. కోటలోని 13వ సచివాలయం ఏడవ సచివాలయంలో ఆదరణ నమోదు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలు ప్రత్యేక ఆధార్ నమోదు కేంద్రాలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.