మరాఠాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన మరాఠా రిజర్వేషన్ బిల్లుకు మహారాష్ట్ర అసెంబ్లీలో ఏకగ్రీవ ఆమోదం లభించింది.
శాసనమండలిలో బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత అది చట్టంగా మారుతుంది. ఈ బిల్లుకు అధికార పక్షంతో పాటు ప్రతిపక్ష పార్టీలు కూడా మద్దతు తెలిపాయి. మరాఠా సమాజానికి ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకున్నట్లు అసెంబ్లీలో సీఎం ఏక్‌నాథ్ షిండే వ్యాఖ్యానించారు.