మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణరెడ్డి తిరిగి సొంతగూటికి చేరుకున్నారు. పార్టీ మారి నెలరోజులు కూడా తిరగక ముందే ఆళ్ల రామకృష్ణా రెడ్డి తిరిగి వైఎస్ఆర్‌సీపీ పార్టీలో జాయిన్ అయ్యారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీ కండువా కప్పుకున్నారు. మంగళగిరి వైసీపీ ఇంఛార్జిగా గంజి చిరంజీవిని నియమించారనే అసంతృప్తితో గతేడాది డిసెంబర్‌లో ఆర్కే వైసీపీ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అనంతరం ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల నియామకం కావటంతో ఆమె వెంట నడిచారు. షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇదే సమయంలో మంగళగిరి నుంచి కాంగ్రెస్ పార్టీ తరుఫున ఆళ్ల రామకృష్ణారెడ్డి
అయితే కాంగ్రెస్ పార్టీలో చేరి నెలరోజులు కూడా తిరగకముందే రామకృష్ణారెడ్డి తిరిగి వైఎస్ఆర్సీపీలో చేరారు. ఇటీవల ఆళ్ల రామకృష్ణారెడ్డితో వైసీపీ సీనియర్ లీడర్ విజయసాయిరెడ్డి చర్చలు జరిపారు. అనంతరం మంగళవారం మధ్యాహ్నం తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో సీఎం జగన్‌ను కలిసిన ఆర్కే.. జగన్ సమక్షంలోనే ఫ్యాన్ పార్టీలో చేరారు. అయితే మంగళగిరిలో వైఎస్ఆర్సీపీని మూడోసారి గెలిపించడమే తన లక్ష్యమని పార్టీలో చేరిన తర్వాత ఆర్కే వెల్లడించారు. మంగళగిరిలో మూడోసారి ఫ్యాన్ గుర్తు ఎగరవేసేందుకే తిరిగి పార్టీలోకి వచ్చానని అన్నారు. మంగళగిరిలో ఈసారి బీసీకి టికెట్ ఇద్దామని వైసీపీ అధిష్ఠానం నిర్ణయించిందన్న రామకృష్ణారెడ్డి.. పార్టీ నియమించిన అభ్యర్థి విజయం కోసం కృషి చేస్తానన్నారు.
అలాగే కాంగ్రెస్ పార్టీలో చేరిన నెలరోజుల్లోనే బయటకు వచ్చేయటంపైనా ఆర్కే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను వైఎస్ఆర్ కుటుంబం భక్తుడినని చెప్పుకొచ్చారు. అందుకే వైసీపీని వీడిన తర్వాత షర్మిలమ్మ పార్టీలో చేరినట్లు చెప్పారు. కానీ ఏపీలోని కాంగ్రెస్ నేతలు వైఎస్ జగన్‌ను లక్ష్యంగా చేసుకోవడం, ఆయన పాలనను దింపేయాలని భావిస్తూ ఉండటంతో.. జగన్‌కు అండగా ఉండాలనే ఉద్దేశంతో తిరిగి వైసీపీలో చేరినట్లు చెప్పుకొచ్చారు.జగన్ మోహన్ రెడ్డి ఎస్సీ, ఎస్టీ , బీసీ మైనారిటీలకు అండగా ఉండారన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి .. జగన్‌కు అండగా ఉండి మంగళగిరిలో వైసీపీ హ్యాట్రిక్ కొట్టాలనే ఉద్దేశంతో తిరిగి వచ్చినట్లు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో మంగళగిరిలో నారా లోకేష్‌కు బీసీ అభ్యర్థి చేతిలో ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు.