రాష్ట్రంలో మీడియాపై దాడులకు సంబంధించి ఏపీ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణికం ఠాగూర్ స్పందించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... మీడియాపై దాడులు దురదృష్టకరమన్నారు. ప్రభుత్వం దాడులకు మద్దతు తెలిపేలా వ్యవహరించడం సరికాదని హితవుపలికారు. నాలుగున్నరేళ్లుగా నియంతలా వ్యవహరిస్తూ.. వైసీపీ వైఫల్యాలపై అసహనానికి గురై మీడియాపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. నిరుద్యోగ సమస్యపై రేపు (గురువారం) కాంగ్రెస్ పార్టీ సచివాలయ ముట్టడి చేపట్టిందని తెలిపారు. యువతకి న్యాయం చేయడం కోసం సచివాలయ మార్చ్ చేపట్టామన్నారు. యువతకు జరుగుతున్న అన్యాయం, ఉద్యోగ కల్పనపై రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞాపన అందిస్తామని మాణికం ఠాగూర్ వెల్లడించారు.