సీఎం జగన్ అప్పులు చేసి బటన్ నొక్కి సంక్షేమ పథకాలు అందిస్తున్నారని.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి బటన్ నొక్కాలని జనసేనాని డిమాండ్ చేశారు. "టీడీపీ - జనసేన కూటమి అధికారంలోకి రాగానే అభివృద్ధి చేస్తూ.. సంక్షేమాన్ని కొనసాగిస్తుంది. మాపై వైసీపీ దుష్ర్పచారం చేస్తోంది. కొందరికి భయపడే వ్యక్తిత్వం నాది కాదు. ప్రజారాజ్యం పార్టీకి 18 సీట్లొచ్చినా నిలబెట్టుకోలేకపోయాం. జనసేనకు సీట్లు రాకపోయినా ఏళ్లుగా నిలబెట్టుకుంటూ వస్తున్నాం. నేను గాజువాకతో పాటు మరోచోట పోటీ చేయాలని అనుకుంటున్నాను. భీమవరంలో పోటీ చేయాలని కొందరు ఆహ్వానించారు. ప్రజలకు మాట ఇచ్చే ముందే బాగా ఆలోచిస్తా. మాట ఇచ్చాక ఆరునూరైనా నెరవేర్చేంతవరకు శ్రమిస్తూనే ఉంటాను. జగన్ తనను ఒంటరి వాడిని చేశారని అంటున్నారు. అందరినీ పీడించిన నువ్వు ఒంటరివాడివెలా అవుతావు. వైసీపీకి 50 సీట్లు కూడా కష్టమని కొందరు బెట్టింగ్లు వేస్తున్నారు. మీరు సిద్ధమంటే నేనూ యుద్ధానికి సిద్ధమే" అని పవన్ స్పష్టం చేశారు