టీడీపీ - జనసేన సమన్వయ కమిటీ సమావేశం గురువారం ప్రారంభమైంది. ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన, ఎన్నికల ప్రచారం, భవిష్యత్ కార్యాచరణ వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ నెల 28న భారీ బహిరంగ సభ నిర్వహించాలనే అంశంపైనా చర్చ జరుగనుంది. ఉమ్మడి సభకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారు. ఈ క్రమంలో సభ ఎక్కడ నిర్వహించాలనే అంశంపై ఈ భేటీలో టీడీపీ - జనసేన క్లారిటీకి వచ్చే అవకాశం ఉంది. మేనిఫెస్టో రూపకల్పనపై కీలకాంశాల ప్రస్తావనకు రానున్నాయి. డ్వాక్రా రుణ మాఫీ హామీ అంశంపై కీలక చర్చ జరుగనుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఫోకస్ పెట్టాల్సిన అంశాలపై సమావేశంలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. వలంటీర్ల వ్యవస్థ కట్టడిపై టీడీపీ - జనసేన కూటమి ప్రత్యేక దృష్టి పెట్టనుంది. వలంటీర్లను పోలింగ్ ఏజెంట్లుగా నియమించాలన్న మంత్రి ధర్మాన వ్యాఖ్యలను టీడీపీ - జనసేన సీరియస్‌గా తీసుకుంది. వలంటీర్లను పోలింగ్ ఏజెంట్లుగా నియమించొద్దని ఈసీ ఆదేశాలు ఉన్నాయమని కూటమి చెబుతోంది. మంత్రి ధర్మాన వ్యాఖ్యలపై ఈసీకి ఫిర్యాదు చేసే అంశంపై సమాలోచనలు చేయనున్నారు. టీడీపీ, జనసేన నుంచి సమావేశానికి కమిటీ సభ్యులు హాజరయ్యారు.