ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్‌పై దాడికి నిరసనగా ‘‘ఛలో అనంత’’కు ఏపీయూడబ్ల్యూజే పిలుపునిచ్చింది. అయితే ఏపీయూడబ్ల్యూజే 'చలో అనంత'పై పోలీసులు నిర్బంధం విధించారు. ఈ కార్యక్రమానికి బయలుదేరిన జర్నలిస్టులను ఎక్కడికక్కడ అణచివేసి... స్టేషన్లకు తరలించారు. అయితే పోలీసుల నిర్బంధం మధ్యే జిల్లాలో జర్నలిస్టులు ర్యాలీ నిర్వహించారు. సంగమేష్ సర్కిల్ నుంచి కలెక్టరేట్ వరకు ఏపీయుడబ్ల్యూజే, జర్నలిస్టులు శాంతి ర్యాలీ చేపట్టారు. పత్రికా స్వేచ్ఛను కాపాడండి అంటూ ఫ్లకార్డులు ప్రదర్శించారు. జర్నలిస్టులపై దాడులు అరికట్టాలని నినాదాలు చేశారు. జర్నలిస్టులపై దాడులు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని, జర్నలిస్టులు రక్షణ చట్టం తేవాలని డిమాండ్ చేశారు.