ముదిగుబ్బ మండలం అడవి బ్రాహ్మణపల్లి తండాలో ప్రజలకు అవసరమైన మంచినీటి చేతిపంపును ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ అనుచరులు రిపేర్ చేయించారు. గ్రామంలో ఉన్న ఈ చేతిపంపు గత కొన్ని సంవత్సరాలుగా రిపేర్ లో ఉన్నది. అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడంతో ధర్మవరం మాజీ ఎమ్మెల్యే దృష్టికి ఈ సమస్యను తీసుకురావడంతో ఆయన తన అనుచరులను పంపించి రిపేరు చేయించారు. శుక్రవారం గ్రామస్తులందరూ గోనుగుంట్లకు కృతజ్ఞతలు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa