ఏపీలోని కోళ్ల పరిశ్రమలను బర్డ్ ఫ్లూ వైరస్ వణికిస్తోంది. బర్డ్ ఫ్లూ కారణంగా గత వారం నెల్లూరు జిల్లాలో భారీ సంఖ్యలో కోళ్లు చనిపోయాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. నెల్లూరు, ఉభయగోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, కడప, ప్రకాశం జిల్లాల్లో 712 ర్యాపిడ్ టీమ్స్ మానిటర్ చేస్తున్నాయని తెలిపింది.