చరిత్రలోనే తొలిసారి పేదలకు ఇంటి స్థలాల రిజిస్టర్డ్ కన్వేయన్స్ డీడ్స్ చేస్తున్నామని.. తద్వారా ఇళ్ల స్థలాలపై లబ్ధిదారులకే సర్వహక్కులు కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ప్రతీ అడుగు పేదల సంక్షేమం కోసం వేశాం. ఈ 58 నెలల కాలంలో పేదల బతుకులు మారాలని అడుగులు వేశాం. దేశ చరిత్రలోనే 31 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చామన్నారు. పేదల కోసం పెత్తందారులపై అనేక పోరాటాలు చేశామని సీఎం గుర్తు చేశారు. ఇంటింటికీ తలుపు తట్టి సేవలు అందిస్తున్నామని.. 58 నెలల పాలనలో మొత్తంగా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని చెప్పారు. ప్రకాశం జిల్లా ఒంగోలు ఎన్.అగ్రహారంలో నిర్వహించిన పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీలో సీఎం వైయస్ జగన్ పాల్గొని ప్రసంగించారు.