నెల్లూరు జిల్లా రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృత్యువాత పడటం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలిపారు. మృతులకు కన్నీటి నివాళులు అర్పించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలన్నారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని నారా లోకేష్ కోరారు. నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కావలి ముసునూరు టోల్ ప్లాజా సమీపంలో మినీలారీ, కావేరి ట్రావెల్స్ బస్సుని ట్రాలీ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. బస్సు ముందు భాగం నుజ్జు నుజ్జైంది. ఇద్దరు ప్రయాణికులు బస్సులోనే ఇరుక్కుపోయారు. తీవ్రగాయాలైన వారిని కావలి ఏరియా ఆసుపత్రికి తరలించారు.