అక్రమంగా వయాగ్రా, ఇతర నిషేధిత డ్రగ్స్‌ను విక్రయిస్తున్నాడనే ఆరోపణలపై ఓ చర్చి ఫాదర్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన స్పెయిన్‌లో చోటుచేసుకుంది. శక్తివంతమైన కామోద్దీపన పదార్థాలను అమ్ముతున్నాడనే అనుమానంతో ఫాదర్ సహా మరొకర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్పెయిన్‌లోని పశ్చిమ ఎక్స్‌ట్రీమదురా ప్రాంతంలో అరెస్ట్ చేసిన అతడి పేరు మాత్రం పోలీసులు వెల్లడించారు. క్రిమినల్ నేరం కింద అభియోగాలు నమోదుచేసి కోర్టులో హాజరుపరిచారు. పూజారి తరపు న్యాయవాది స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఆరోపణలు నిరాధారమని కొట్టిపారేయడం గమనార్హం.
స్పెయిన్ మీడియా నివేదికల ప్రకారం.. డాన్ బెనిటో పట్టణంలో నివసించే పూజారి.. నిషేధిత పదార్ధాలను విక్రయింస్తున్నాడనే ఆరోపణలపై నెల రోజుల విచారణ తర్వాత అరెస్టు చేశారు. పోలీసులు నిర్బంధించి మరో వ్యక్తి పూజారి లైంగిక భాగస్వామి అని పేర్కొన్నాయి. తమ ఇంటి నుంచి కస్టమర్లకు వయాగ్రాను విక్రయించారు. సోమవారం వారి ఇంటిపై నిఘా ఉంచిన పోలీసులు.. మెరుపు సోదాలు నిర్వహించి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పూజారి తరఫున లాయర్ మాత్రం.. నిషేధిత పదార్థాలు ఇంట్లో లభించాయనడానికి ఎటువంటి ఆధారాల్లేవని చెప్పారు.
కాగా, స్పెయిన్ చట్టాల ప్రకారం.. వయాగ్రా ఫార్మసీలో అందుబాటులో ఉంటుంది. అయితే, ఈ ఇద్దరూ ఎటువంటి పదార్థాలను విక్రయించారనేది స్పష్టంగా తెలియదు. సివిల్ గార్డ్స్ మాత్రం భారీ మొత్తంలో కామోద్దీపన మాత్రలు, ఇతర పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. దర్యాప్తు కొనసాగుతోందని, విచారణ తర్వాత పూర్తి వివరాలను వెల్లడిస్తామని చెప్పారు. అటు, ఈ అంశంపై ఫాదర్ సదరు చర్చి ప్లాసెన్సియా డియోసెస్ స్పందిస్తూ.. వాస్తవాలు స్పష్టంగా తెలిసిన తర్వాత తదుపరి దర్యాప్తు కొనసాగిస్తామని తెలిపింది. ఈ సంఘటనపై తాము తీవ్రంగా చింతిస్తున్నామని పేర్కొంది.