తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్. ఇవాళ శేషాచలా అడవుల్లోని పుణ్యతీర్థాలలో ఒకటైన కుమారధార తీర్థ ముక్కోటి జరగనుంది. ఇందుకు టీటీడీ భారీ ఏర్పాట్లు చేసింది.
ఉ. 5.30 గంటల నుంచి మ. 12 గంటల వరకు మాత్రమే కుమారధార తీర్థానికి భక్తులను అనుమతిస్తారు. గోగర్భం నుంచి పాపవినాశనం వరకు ఆర్టీసీ బస్సుల్లో మాత్రమే భక్తులను అనుమతిస్తారు. కుమారధార తీర్థముక్కోటిని దర్శించి, స్నానమాచరిస్తే పుణ్యం దక్కుతుందని భక్తుల విశ్వాసం.