ఓటర్ల జాబితాపై వచ్చిన దరఖాస్తులను పరిష్కరిస్తున్నామని కర్నూలు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా.జి.సృజన అన్నారు. శుక్రవారం రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనా విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లతో పార్మ్స్ డిస్పోజల్ ఎన్నికల సన్నద్ధ్దత అంశాలపై సమావేశం నిర్వహించి జిల్లాలో జరుగుతున్న ఏర్పాట్లపై కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఈవో ముఖేష్ కుమార్ మీనాకు వివరిస్తూ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులకు స్ర్టాంగ్ రూమ్ విషయాలు, ఎలక్షన్ కౌంటింగ్ సెంటర్ల వివరాలు, వచ్చిన కంప్లైంట్స్ వివరాలు, దినపత్రికల్లో వచ్చిన వ్యతిరేక వార్తలపై తీసుకున్న చర్యల వివరాలను పారదర్శకంగా ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నా మన్నారు. కర్నూలు జిల్లాకు కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులు ఉన్నాయని, వీటిపై నిరంతరం నిఘా ఉంచామని, ఇంత వరకు రూ.7.18 కోట్లు నగదు స్వాధీనం పరుచుకున్నామని తెలిపారు. కొద్ది మొత్తంలో లిక్కర్ కూడా స్వాధీనం చేసుకున్నామని కలెక్టర్ తెలిపారు. దినపత్రి కలలో వచ్చిన మండలాలకు సంబంధించిన 152 కంప్లైంట్లను పరిష్కరి స్తున్నామని తెలిపారు.