ఏపీలో రోజూరోజుకి ఎండల తీవ్రత పెరుగుతోంది. ఆదివారం అనంతపురంలో 39 డిగ్రీలు, నంద్యాల, వైఎస్సార్, కర్నూలు జిల్లాలో సగటున 38 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు అయింది. అలాగే, రాష్ట్రంలో చాలా చోట్ల సాధారణ కంటే 3-4 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వెస్టర్న్ డిస్టర్బెన్స్ ప్రభావం ఏపీపై కనపడుతోందని, దీనివల్ల ఉష్ణతాపం, ఉక్కపోత ఎక్కువగా ఉంటోందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.