పాలస్తీనా ప్రధానమంత్రి మొహమ్మద్ శతాయే రాజీనామా చేశారు. గాజాతో పాటు వెస్ట్ బ్యాంకులో హింస తీవ్రతరమవుతోన్న నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అధ్యక్షుడు మొహమూద్ అబ్బాస్‌కు రాజీనామా లేఖను అందజేశారు. ‘గాజా స్ట్రిప్‌పై దురాక్రమణకు సంబంధించి చోటుచేసుకుంటున్న పరిణామాలు, వెస్ట్‌బ్యాంక్, జెరూసలేంలలో హింసాత్మక ఘటనలు తీవ్రతరమైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నా. రాజీనామాను అధ్యక్షుడికి అందజేశాను’ అని శతాయే పేర్కొన్నారు.