పాకిస్థాన్‌లో తొలి మహిళా సీఎంగా మరియం నవాజ్ ఎన్నికై చరిత్ర సృష్టించారు. పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (PML-N) పార్టీ అభ్యర్థి అయిన ఆమె పంజాబ్ ముఖ్యమంత్రిగా ఆమె సోమవారం ఎన్నికయ్యారు. ఎన్నికలలో ఆమె 220 ఓట్లను సాధించి, తన సమీప ప్రత్యర్థి రాణా అఫ్తాబ్ అహ్మద్‌పై తిరుగులేని విజయం సాధించారు. ఆమె పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె. 2012లో ఆమె రాజకీయాల్లోకి వచ్చారు. ఆమెకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు.