రాష్ట్రంలో వచ్చేది టీడీపీ, జనసేన ప్రభుత్వమేనని ప్రతి సర్వే స్పష్టంగా చెబుతున్నట్లు మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు తెలిపారు. సోమవారం చిలకలూరిపేట టీడీపీ కార్యాలయంలో ' మై ఫస్ట్ ఓట్ ఫర్ సీబీఎన్' కార్యక్రమాన్ని ప్రారంభించారు. జగన్ ప్రభుత్వం అలవికాని హామీలు ఇచ్చి హామీలను నిలబెట్టుకోలేకపోయిందని ఆయన ఎద్దేవా చేశారు. టీడీపీ, జనసేన ఉమ్మడిగా సీట్లు ప్రకటించడంతో తాడేపల్లి ప్యాలెస్ లో ప్రకంపనలు మొదలయ్యాయన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa