అంటార్కిటికా ఖండంలోని ప్రధాన భూభాగంలో తొలి బర్డ్ ఫ్లూ కేసు నమోదైంది. ఇది పర్యావరణ విపత్తుకు దారితీస్తుందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పక్షుల్లో తీవ్ర అనారోగ్యానికి కారణమయ్యే ఈ వైరస్ ను ఈ నెల 24న గుర్తించారు. మృతిచెందిన రెండు స్కువా పక్షుల నుంచి సేకరించిన నమూనాల్లో ఈ వైరస్ ఉనికిని గుర్తించారు. అంటార్కిటికాలోని వేలాది పెంగ్విన్‌లకు ఈ వ్యాధి వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు.