ఒంగోలు పరిధిలోని కరవది రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం చోటు చేసుకున్నది. స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రైల్వే సీఐ శ్రీకాంత్ ఘటనా స్థలానికి చేరుకొని, మృతదేహాన్ని పరిశీలించారు. 65 ఏళ్ల వృద్ధుడు తెలుపు రంగు పంచె, తెలుపు రంగు చొక్కా ధరించినట్లు తెలిపారు. వృద్ధుడి వద్ద ఎటువంటి ఆధారాలు లభించలేదని సిఐ పేర్కొన్నారు.