ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) మంగళవారం షాకిచ్చింది. 8వ సారి సమన్లు జారీ చేసింది. ఢిల్లీలోని ED ఆఫీసులో మార్చి 4న విచారణకు హాజరు కావాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇప్పటి వరకు గత ఏడుసార్లు ED సమన్లు పంపగా, విచారణకు కేజ్రీవాల్ గైర్హాజరయ్యారు. పదే పదే ED సమన్లు జారీ చేయడంపై AAP అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.