ఆంధ్ర క్రికెట్ జట్టుకు ఆడబోనని హనుమ విహారి సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఏపీ రాజకీయాల్లో దూమారం రేపుతోంది. టీడీపీ చీఫ్ చంద్రబాబు ట్విట్టర్ వేదికగా స్పందించాడు. ‘వైసీపీ ప్రతీకార రాజకీయాలకు ఆంధ్రా క్రికెట్ సంఘం కూడా లొంగిపోవడం సిగ్గుచేటు.
హనుమ విహారి ఒక ఇంటర్నేషనల్ క్రికెటర్. అతను ఏపీ తరఫున ఎప్పటికీ ఆడనని ప్రమాణం చేసే స్థాయికి తీసుకొచ్చారు. హనుమ మీరు దృఢంగా ఉండండి. మీకు న్యాయం జరిగేలా చూస్తాం.’ అని పేర్కొన్నారు.