మండపేట సంఘమేశ్వర కాలనీ ప్రాథమిక పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ప్రధానోపాధ్యాయురాలు ముత్యాల మాణిక్యంబ బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ సివి రామన్ సైన్స్ కి చేసిన కృషి గురించి వివరించారు. 1928లో రామన్ ఎఫెక్ట్ ఫలితంగా సైన్స్ అభివృద్ధి పథంలోకి వచ్చిందని, సీవి రామన్ కి నోబెల్ పురస్కారం, భారతరత్న వంటి అవార్డులు పొందారన్నారు. అనంతరం విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు.