కేంద్రం ప్రవేశపెట్టిన అగ్నిపథ్‌పై పశ్చిమబెంగాల్ కాంగ్రెస్ చీఫ్ అధిర్ రంజన్ చౌదరి విమర్శలు చేశారు. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన అగ్నివీర్‌లకు సరైన మర్యాద దక్కట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆర్మీని రకరకాలుగా విడగొట్టారని, దానికి కారణమేంటని ప్రశ్నించారు. ఆర్మీలో ఇలాంటి విభజనను తాము కోరుకోలేదని.. ప్రతి సైనికుడు సమానమేనని చెప్పుకొచ్చారు. వారిని విభజించడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదని మండిపడ్డారు.