అవినీతి నిరోధక అంబుడ్స్‌మన్- లోక్‌పాల్‌కు ఛైర్‌పర్సన్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ మాణిక్‌రావ్ ఖాన్విల్కర్ నియమితులయ్యారు. జస్టిస్ ఖాన్విల్కర్ 1957 జులై 30న మహారాష్ట్రలోని పుణెలో జన్మించారు.
1984లో సుప్రీంకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించారు. కేంద్ర ఎన్నికల సంఘం స్టాండింగ్ కౌన్సిల్‌గా పనిచేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా 187 తీర్పులు ఇచ్చారు.