హిందూ సాంప్రదాయంలో శుభకార్యాలకు ముహూర్తం అనేది ఆనవాయితీగా వస్తుంది. శుభ ముహూర్తాలు లేనిదే హిందూ సాంప్రదాయంలో ఎలాంటి శుభకార్యాలు జరగవు. మార్చి నెలలో 1, 2, 3, 4, 5, 6, 7, 10, 11, 12వ తేదీలలో స్వాతి, అనురాధా, మూల, ఉత్తరాషాఢ, ఉత్తర భాద్రపద, రేవతి నక్షత్రాల వేళ మంచి ముహూర్తాలు ఉన్నట్లు వేదపండితులు తెలిపారు.