ఏపీలో దుర్మార్గపు, అరాచక పాలన తరిమికొట్టడమే ‘జనసేన’ లక్ష్యమని జనసేన రాష్ట్ర నేత వేములపాటి అజయ్ కుమార్ అన్నారు. నెల్లూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఎవరికి టిక్కెట్టు ఇచ్చినా అందరం కలిసి పనిచేస్తామన్నారు. రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ లాంటి నిజాయితీ, నిబద్దత కలిగిన నేతని చూడలేదని, అందుకే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. ప్రపంచంలో ఏ మార్పు అయినా యువతతోనే సాధ్యమని ఆయన అన్నారు. మా వెంట పెద్ద సంఖ్యలో యువత నడుస్తుంది, ఏపీలో రాబోయే మార్పునకు ఇదే సంకేతం అని ఆయప అన్నారు. టిక్కెట్టు ఆశించి పొందలేని వారిలో కొంత నిరాశ ఉంటుందని, అధికారంలోకి వచ్చాక అనేక పదవులు ఉంటాయని, కష్టపడిన ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు ఉంటుందని ఆయన అన్నారు.