కాంగ్రెస్ నాయకత్వానికి తన రాజీనామా ఇచ్చినట్లు వస్తున్న వార్తలను హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సఖూ బుధవారం ఖండించారు. 'నేను రాజీనామా చేయలేదని స్పష్టం చేయాలనుకుంటున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేళ్లు పూర్తి చేస్తుంది. మేము పోరాట యోధులమని, మేము మా మెజారిటీని నిరూపించుకుంటాము' అని సుఖు సిమ్లాలో మీడియాతో అన్నారు. అయితే బీజేపీ నేత హర్ష్ మహాజన్ తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.